మధువనిలో రాధికవో మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం
మధురం ఈ జవ్వనం
మనోహరం మనోహరం
మధువనిలో రాధికవో మదిపలికే గీతికవో
మధురం ఈ జీవనం
మధురం ఈ యవ్వనం
మనోహరం మనోహరం
కార్తీకాన కళలే చిలికే వెలిగే జాబిలి
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలి
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడు
వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడు
తొలి తొలి వలపులే
తొలకరి మెరుపులై
విరిసే వేళలో...హేళలో...డోలలో..
బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు
ఎదిగిన బాలిక ఎదగల గోపికకతడే దేవుడు
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిక
మరువై పోయిన మనసున వెలసెను
నేడీ దేవత
వెలుగుల వీణలే
పలికెను జాణలో
అది ఏ రాగమో...భావమో...బంధమో..







